నానితో జోడి కడుతున్న శృతి హాసన్

0న్యాచురల్ స్టార్ నాని నటించబోతున్న కొత్త చిత్రం “జెర్సీ”. సితార ఎంటర్టైన్మెంట్స్ పతకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. 1980 దశకం నేపథ్యంలో జరిగే ఈ కథలో నాని క్రికెటర్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా శృతిహాసన్ ని ఎంపిక చేసారు.

“కాటమరాయుడు” చిత్రం తర్వాత తెలుగులో నటించని శృతి హాసన్ మళ్ళీ నాని చిత్రంతో తెలుగులో కనిపించబోతోంది. ఇక ఈ చిత్రంతో పాటుగా నాని… శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో మల్టీస్టారర్ చేస్తున్నాడు వైజయంతి మూవీస్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి కామెడీ స్టైల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో నటిస్తుండగా నాని డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా విడుదలవుతోంది.