ఎస్‌ఎస్ రాజమౌళి పైసా వసూల్ రివ్యూ

0Rajamouliనందమూరి నటసింహం బాలయ్యబాబు నటించిన ‘పైసా వసూల్’ చిత్రం ఈ రోజే (సెప్టెంబర్ 1న) విడుదలైంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య సరసన శ్రీయ, ముస్కాన్, కైరాదత్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిత్రంలో బాలయ్యబాబు ఎనర్జిటిక్ నటన చూసి ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో థియేటర్లను హోరెత్తిస్తున్నారు. ‘తేడా సింగ్’ గా బాలయ్య నటనకు ఫిదా అయ్యారు జనమంతా.

కాగా విడుదలైన మొదటిరోజే ఈసినిమా చూసిన దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సినిమా, బాలయ్యబాబు నటన రెండూ అధ్బుతంగా ఉన్నాయంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా.. ‘హై ఎనర్జీతో కూడిన బాలయ్యను పూరీ గారు చూపించారు. బాలయ్య గత 100 చిత్రాల కంటే బిన్నంగా ఈచిత్రంలో దర్శనమిచ్చాడు. కోకాకోలా పెప్సీ..!బాలయ్యబాబు సెక్సీ..!!’ అంటూ రాజమౌళి ట్వీట్ రాశారు.