రాజమౌళి దంపతుల డాన్స్… వీడియో వైరల్

0దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్టుతో ఏ రేంజికి వెళ్లాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖుల గురించి మాట్లాడుకుంటే అందులో రాజమౌళి పేరు తప్పకుండా ఉంటుంది. బాహుబలి ప్రాజెక్టుతో కేవలం నేషల్ వైడ్ మాత్రమే కాదు… ఇంటర్నేషనల్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమా షూటింగ్ జరిగినంత కాలం వేరే ధ్యాస లేకుండా కష్టపడిన రాజమౌళి అండ్ ఫ్యామిలీ…. ప్రస్తుతం వెకేషన్స్ లో గడుపుతూ రిలాక్స్ అవుతున్నారు. బాహుబలి ప్రాజెక్టులో రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కీరవాణి, శ్రీవళ్లి, కార్తికేయ తదితరులు కూడా పని చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా వారి ఫ్యామిలీకి సంబంధించి ఓ ఈవెంటులో రాజమౌళితో పాటు ఆయన భార్య రమ, మరికొందరు డాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.

రాజమౌళి ఎప్పుడూ పని పని పని ఇదే ధ్యాసగా గడుపుతుంటారు…. ఆయనలో ఇలాంటి కోణం ఎప్పుడూ చూడలేదని ఆయన డాన్స్ చూసిన అభిమానులు అంటున్నారు.