దర్శకుడు రాజమౌళికి అరుదైన పురస్కారం!

0Rajamouliదర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున తెలిపారు. సినీ రంగానికి చేసిన అద్భుతమైన సేవలకు గానూ జక్కన్నకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో రాజమౌళికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెప్టెంబరు 17న సాయంత్రం 4.30 గంటలకు శిల్ప కళావేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాగార్జున పేర్కొన్నారు.

‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంతో దర్శకుడిగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన రాజమౌళి విజయవంతమైన దర్శకుడిగా పేరు పొందారు. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాలు అద్భుత విజయాన్ని సాధించి, కాసుల వర్షం కురిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచాయి.