పవన్ ని తిట్టించిన స్టార్ డైరెక్టర్ ?

0శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ వెనుక ఏదో అజ్ఞాత హస్తం ఉందన్న అనుమానాలకు బలం చేకూరేలా సోషల్ యాక్టివిస్ట్ సంధ్య పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డిని పవన్ కళ్యాణ్ ని తిట్టమని ఒక ప్రముఖ దర్శకుడు పదే పదే మెసేజులు పెట్టడం తాను స్వయంగా చూశానని అవి తనకు పంపమని చెప్పినా శ్రీరెడ్డి చేయలేదని కాని ఆ పదాన్ని వాడమని చెప్పింది కూడా అతనే అని ఆవిడ స్పష్టంగా చెబుతున్నారు. సంచలన విషయాల గురించి ఎప్పుడు ట్వీట్లు పెడుతూ ఉండే ఆ దర్శకుడు ఎవరు అనేది ఈజీగా అందరికి అర్థమవుతున్నా ఆవిడ కూడా నేరుగా పేరుని ప్రస్తావించకపోవడం గమనార్హం. దానికి తోడు ఆ దర్శకుడు తన ట్విట్టర్ లో ఓ మగాడు ఒక సినిమాలో ఆ మాట మాట్లాడితే ఎగబడి చూసిన జనం అదే పదాన్ని ఒక హీరోని అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ట్విట్టర్ లోనే ప్రశ్నించడం గమనార్హం.

ఇప్పుడు ఈ ఉదంతం కొత్త మలుపు తిరుగుతోంది. సంధ్య చెప్పిన విషయం ఎవరి గురించో అర్థమవుతోంది కనక ఇప్పుడు ఫాన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది అసలు మలుపు. ఇవాళ ఉదయం శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఎకౌంటులో మిత్రుడిగా భావించిన ఒక శత్రువు తనను పక్కదారి పట్టించి పవన్ కళ్యాణ్ ను తిట్టేలా చేసాడని టైం వచ్చినప్పుడు అతని బండారం కూడా బయట పడతానని చెప్పడం ఇప్పటికే హాట్ టాపిక్ గా ఉంది. ఈ రెండు లింక్ చేసి చూస్తే సంధ్య చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు అనిపిస్తోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న శ్రీరెడ్డి ఇష్యూ జీవిత-నాగబాబు ప్రెస్ మీట్ల తర్వాత ఇంకా వేడిగా మారింది. మరి ఆ స్టార్ డైరెక్టర్ తనను ప్రేరేపించాడు అని చెబుతున్న శ్రీరెడ్డి ఆ ఆధారాలు బయట పెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంత స్పష్టంగా ఆరోపిస్తున్నప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెతలో ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో లెట్ వెయిట్ అండ్ సి

Click Here For Video : https://www.youtube.com/watch?v=ea6n3OuCMB4