మళ్లీ కమీడియన్ గా ఆ కామెడీ హీరో?

0man-shadowహీరోగా రెండు పదుల మార్కెట్ లో కొనసాగుతున్న ఆ కమీడియన్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ లో ఉన్నాడు. వరుస ఫ్లాపులు ఆ కామెడీ హీరోని పలకరిస్తున్నాయి. తనకు క్రేజ్ తెచ్చిన కామెడీని డామినేట్ చేసేలా యాక్షన్ టచ్ ఉన్న కథల్ని ఇటీవల ఎంచుకున్న ఆ హీరోగారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ట్రాక్ తప్పారు. అయితే మళ్లీ బండిని గాఢిలోకి పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆ హీరోగారికి రోజురోజుకి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయట. ప్రస్తుతం ఆ కామెడీ హీరోగారి నుంచి ఓ డిఫరెంట్ కంటెంట్ తో ఉన్న సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ ఆ సినిమా రిలీజ్ కి రోజుకో అడ్డంకి ఎదురవుతూనే ఉంది. సినిమా షూటింగ్ కంప్లీటై దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వలేదని తెలిసింది. అయితే ఇందుకు ఫైనాన్స్ ప్రాబ్లమ్సే అసలు కారణం అనే టాక్ వినిపిస్తున్నాయి. ఇది పక్కనపెడితే ఆ హీరోగారు యాక్ట్ చేస్తున్నే మరో సినిమా కూడా నత్తనడకన సాగుతుందని సమాచారం. దీంతో విసుగుచెందిన ఆ హీరోగారు ఈ అప్ కమింగ్ సినిమాలు రెండు పూర్తి కాగానే ఓ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అయితే ఆ హీరోగారు మళ్లీ కమీడియన్ గా టర్న్ కావచ్చు అని అదే అతడు తీసుకోబోయే నిర్ణయం అని ఇప్పటికే ఓ స్టార్ హీరో సినిమాతో మళ్లీ కమీడియన్ గా టర్న్ అయ్యేందుకు సన్నాహాలు కూడా మొదలుపెట్టాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.