అమరావతిలో బిజినెస్..ఆ స్టార్ హీరో కు ఝలక్

0

అన్నీ సినిమాలు హిట్ కావు. అన్నీ బిజినెస్ లు లాభాలు తీసుకురావు. అలా అని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకుండా ఊరుకుంటారా? పెడతారు. అలాగే మన టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో భారీగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారట.

ఈయన ఎప్పుడూ భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే రకం కాకపోయినా మధ్యవర్తులు అమరావతి అదని.. ఇదని.. రియల్ బూమ్ ఆకాశాన్ని తాకి భారీ లాభం వస్తుందని నమ్మించి ఆ హీరోను పెట్టుబడులు పెట్టేలా చేశారట. వాళ్ళుమాత్రం రైతుల దగ్గర సరసమైన ధరలకు భూమి కొని.. అదే భూమిని స్టార్ హీరో కు భారీ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారట. ఇక ఆ హీరో తన పరిచయాల ద్వారా ఎంత ప్రయత్నించినా తన వెంచర్ లో 50% ఇంకా అమ్ముడుపోలేదట. తక్కువ మొత్తం కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆయనకు ఇలాంటి పరిస్థతి వచ్చి ఉండేది కాదని అయన సన్నిహితులు అంటున్నారు.

అయనకు తన వెంచర్ లో అపార్ట్ మెంట్ లేదా ఇళ్ళను నిర్మించి అమ్మే ఆలోచన అసలు లేకపోవడంతో మరింతగా నష్టపోతున్నాడని సమాచారం. అనుభవం లేకనే ఇలా రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడి పెట్టి ఇరుక్కున్నాడని.. అదే అయన ఆ రంగంలో అనుభవం ఉన్న సీనియర్ల సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఏదేమైనా అమరావతి వ్యాపారం ఆ హీరోకు చేదు అనుభవం గా మారిందన్నమాట.
Please Read Disclaimer