పూరి పుత్రునికి స్టార్ హీరోలే ఫ్యాన్స్

0పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ అనేవాళ్లు .. ఆకాష్ ఫాదర్ పూరి జగన్నాథ్ అని చెప్పాలి. ఇదీ కమెడియన్ – పూరి క్లోజ్ ఫ్రెండ్ అలీ ఇచ్చిన బ్లెస్సింగ్. పూరి పుత్రరత్నం నవతరం హీరో ఆకాష్ పూరి పుట్టినరోజు సందర్భంగా అలీతో పాటు మన స్టార్ హీరోలంతా శుభాకాంక్షలు తెలిపారు. దర్శకులు – టెక్నీషియన్లు – హీరోయిన్లు అంతా పుట్టినరోజు శుభాకాంక్షలతో హోరెత్తించారు. ఇంకా చెప్పాలంటే పూరి అంటే అభిమానం ఉన్నవాళ్లంతా.. పూరి సినిమాల్లో నటించినవారంతా .. అందుబాటులో ఉన్నవారంతా వీడియో బైట్స్ ఇచ్చి ఆకాష్ లో జోష్ పెంచడం విశేషం. ఇక వీళ్లలో నితిన్ అయితే బర్త్ డేని బాగా ఎంజాయ్ చేస్తూ.. తాగి పడుకోమని సెలవిచ్చాడు.

అసలింతకీ ఆకాష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఎవరెవరు ఉన్నారు? అంటే.. ప్రభాస్ – రవితేజ – నితిన్ – అల్లు శిరీష్ – సుకుమార్ – సాయిధరమ్ – అలీ – దశరథ్ – సిరాశ్రీ – సుబ్బరాజు – కోన వెంకట్ – సుబ్బరాజు – ప్రియమణి – ఇంకా వందమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ వీడియో బైట్స్ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోతున్నాయ్. ఆంధ్రా పోరి – మెహబూబా చిత్రాలతో హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు ఆకాష్. తండ్రిలానే డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ చూపించడంలో సక్సెసయ్యాడు. బాలనటుడిగా అపార అనుభవం ఉన్న ఆకాష్ హీరోగా ఎక్కడా తొట్రుపడకుండా – టెన్షన్ అన్నదే లేకుండా మెస్మరైజ్ చేసి చూపించాడు మెహబూబాలో. అందుకే అతడికి పెద్ద భవిష్యత్ ఉందంటూ సెలబ్రిటీలంతా కితాబిచ్చారు.