అన్నీ చూపిస్తా అదొక్కటీ తప్పా

0Woman-without-make-up-shadoఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు రిటైర్మెంట్ కు దగ్గరగా ఉంది. సినిమా కెరీర్ అయిపోయిందని కాదు కానీ.. ప్రస్తుతం ఈ భామ కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందుకే కొత్తకొత్తగా ప్రవర్తించేస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ లో జీవితంలో టర్న్ తిరుగుతుండడంతో.. రీల్ లైఫ్ లో కొత్త కండిషన్స్ పెడుతోంది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ ఓ స్టార్ హీరోతో సినిమా చేయనుంది.

ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ వినిపిస్తోంది కానీ.. ఇప్పటికి జత కట్టడం సాధ్యమైంది. గ్లామర్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు పెట్టుకోని ఈ భామ. ఇప్పుడు మేకర్స్ కి ఈ విషయంలో కొత్త కండిషన్స్ పెడుతోందిట. “డ్రస్సుల విషయంలో ఎలాంటివి వేసుకునేందుకు అయినా నాకు అభ్యంతరం లేదు. నేను వాటిని మెయింటెయిన్ చేస్తాను. కానీ నాభి ప్రదర్శన మాత్రం కుదరంతే. పాటల్లోనూ.. సీన్లలోనూ ఎక్కడా ఇది మాత్రం కుదరదు” అని చెప్పిందట. ఈ దర్శకుడు హీరోయిన్లను గ్లామర్ గా చూపించడంలో విపరీతమైన ట్యాలెంట్ చూపించేస్తుంటాడు.

దీంతో.. ఈమె పెట్టిన కండిషన్ దర్శకుడిని పెద్దగా ఇప్పంది పెట్టలేదట. ఈ పాత్రకు మాంచి అనుభవంతో పాటు ట్యాలెంట్ ఉన్న హీరోయిన్ కావాల్సి ఉండడంతో.. ఆమె చెప్పిన కండిషన్స్ కు అంగీకరించేశారట. నిజానికి ఈమె గ్లామరసం గురిపించనంత మాత్రాన ఈ సినిమాలో వచ్చేసే తేడాలు ఏమీ ఉండవన్నది ఓపెన్ సీక్రెట్.