డ్రగ్స్ మత్తులో స్టార్ హీరోయిన్??

0


Star-Heroine-Involvement-in-Drugsకొన్ని రోజుల క్రితం పట్టుపడిన డ్రగ్స్ ముఠాతో.. తెలుగు సినీ పరిశ్రమలో పలువురి అండదండలు ఉన్నాయనే మాట వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై బడా నిర్మాతలు అల్లు అరవింద్.. సురేష్ బాబులతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా భేటీ అయ్యి.. ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఓ 10-15 మంది కారణంగా ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని.. ఆయా స్టార్లు.. యాక్టర్లు వెంటనే వీటిని విడిచిపెట్టాలని సినీ పెద్దలు సూచించారు.

అయితే.. ఈ పది పదిహేను మంది ఎవరు అనే పాయింట్ పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తోంది. డ్రగ్స్ ముఠాతో సంబంధాలు అంటే.. అది మొత్తం తెలుగు సినీ పరిశ్రమకే మచ్చ తెచ్చే అంశంగా చెప్పాలి. ఇప్పటికే విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. పలువురికి నోటీసులు పంపినట్లు కూడా చెబుతున్నారు. వీరిలో ముగ్గురు యంగ్ హీరోలు.. ఒక హీరోయిన్.. ముగ్గురు నిర్మాతలు.. ఇద్దరు డైరెక్టర్లు.. ఒక కొరియోగ్రాఫర్.. ఒక స్టంట్ మాస్టర్ ఉన్నారట. రాబోయే ఆరు రోజుల్లో ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని వీరికి ఆదేశాలు అందాయట. అయితే.. ఈ లిస్ట్ ఇప్పటికే ‘మా’ దగ్గర ఉందని అంటున్నారు.

త్వరలో పోలీసులు వీరి పేర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉందట. కానీ టాలీవుడ్ సినీ పెద్దలు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే.. అన్ని పేర్లు బయటకు వస్తాయా.. వీటిలో ఓ స్టార్ హీరోయిన్ పేరు కూడా ఉంటుందా అనే చర్చలు సాగుతున్నాయి. ఆమెకు రాజకీయంగా కూడా పలుకుబడి ఉండడం.. టాలీవుడ్ టాప్ రేంజ్ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. ఆమె పేరు మాత్రం లిస్ట్ లో ఉండకపోవచ్చని అంచనా.