అలియా స్పెషల్ సాంగ్ రేపే..!

0

ఈ సమ్మర్లో రిలీజ్ కానున్న బాలీవుడ్ చిత్రాలలో ఒకటి ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2’. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పునీత్ మల్హోత్రా దర్శకుడు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్.. అనన్య పాండే.. తారా సుతారియాలు లీడ్ యాక్టర్స్. ఇప్పటికే బాలీవుడ్ నెపోటిజం పితామహుడుగా పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ ఈ సినిమాతో అనన్య పాండే.. తారా సుతారియాలను హీరోయిన్లుగా బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాను మే 10 న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్ జోరుగా సాగుతున్నాయి.

సూపర్ హిట్ ఫిలిం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై క్రేజ్ భారీగానే ఉంది. మరోవైపు ఈ సినిమాలో స్టూడెంట్స్ అయిన హీరో హీరోయిన్లు వేసుకునే బట్టలు.. జిమ్నాస్టిక్ డ్యాన్సులపై విమర్శకులు కూడా వెల్లువెత్తుతున్నాయి. కానీ ఎంత హంగామా అయితే అంత క్రేజ్ సినిమాకు. అందుకే కరణ్ జోహార్ ఫుల్ ఖుష్ గా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘హుక్ అప్ సాంగ్’ ను విడుదల చేస్తున్నామని.. ఈ పాట మంగళవారం విడుదల అవుతుందని తెలిపాడు. ఈ ప్రత్యేక గీతంలో హీరో టైగర్ ష్రాఫ్ తో పాటు బ్యూటిఫుల్ అలియా భట్ ఆడిపాడుతుంది అంటూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. పోస్టర్ తో పాటుగా “హుక్ అప్ సాంగ్ మంగళవారం విడుదల అవుతోంది. దాంతో పెరిగే వేడిని మీరు హ్యాండిల్ చేసేందుకు రెడీగా ఉన్నారా?” అంటూ ట్వీట్ చేశాడు.

పోస్టర్ లో టైగర్ ష్రాఫ్.. అలియాల ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. కాకపోతే వారి డ్రెస్సులు మాత్రం అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో ఉండే వ్యోమగాములు వేసుకునే బట్టల మాదిరిగా ఉన్నాయి. చూస్తుంటే హీరో హీరోయిన్లకు కరణ్ జోహార్ స్వయంగా స్టైలింగ్ చేసినట్టున్నాడు. ఇట్స్ టూ ఫ్లాషీ నో..!
Please Read Disclaimer