అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన స్టార్స్..

0స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా బన్నీ కి సోషల్‌మీడియా ద్వారా అభిమానులు, సినీ ప్రముఖులు తమ విషెష్ ను తెలియజేసారు. ఎవరెవరు ఏవిధంగా విషెష్ తెలియజేసారో మీరే చూడండి..

* వరుణ్‌తేజ్‌: ‘బన్నీ అన్న.. జన్మదిన శుభాకాంక్షలు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో నువ్వు అద్భుతంగా ఉన్నావు. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’.

* సాయిధరమ్‌ తేజ్‌: ‘వన్‌ ఇండియా.. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ. ఈ ఏడాది నీకు విజయవంతంగా, గొప్పగా ఉండాలి’.

* కాజల్‌: ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. ఈ ఏడాది నీకు గొప్పగా, సంతోషంతో నిండి ఉండాలని కోరుకంటున్నా’.

* లావణ్య త్రిపాఠి: ‘జన్మదిన శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. గ్రేట్‌ ఇయర్‌ ఎ హెడ్‌’.

* మారుతి: ‘బన్నీబాబు అలియాస్‌ సూర్యకు హ్యాపీ బర్త్‌డే’.

* పూజా హెగ్డే: ‘మేమిద్దరం కలిసి ఒకేసారి లుంగీ ధరించే అవకాశం వచ్చింది.. భలే సందడి చేశాం.. ఇద్దరం కలిసి దెబ్బలు తగిచించుకున్నాం (నవ్వుతూ). ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా సెట్‌లో చాలా సరదాగా ఉన్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. ఈ ఏడాది నీకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’.

ప్రస్తుతం అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తో మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి డైరెక్టర్.