స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లాభాలో

0sbiస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,840 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఈ బ్యాంక్‌ కేవలం రూ.21 కోట్ల నికర లాభాన్నే సాధించి ంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయం కారణంగా ఇతర ఆదాయం భారీగా పెరగడం, నిర్వహణ లాభం కూడా పెరగడం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటంతో పాటు రూ.720 కోట్ల ట్యాక్స్‌ రైట్‌బ్యాక్‌ కారణంగా నికర లాభం ఈ స్థాయిలో ఉందని ఎస్‌బీఐ తెలిపింది.

ఇక స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే నికర లాభం తగ్గిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. గత క్యూ2లో రూ.2,538 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 38 శాతం క్షీణించి రూ.1,582 కోట్లకు తగ్గిందని వివరించారు. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన స్టాండోలోన్‌ నికర లాభం 21 శాతం క్షీణించిందని తెలిపారు. మొండి బకాయిలకు భారీ కేటాయింపులు కారణంగా నికర లాభం తగ్గిందని పేర్కొన్నారు.

నిర్వహణ లాభం 30 శాతం అప్‌…

గత క్యూ2లో రూ.50,743 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం(స్టాండోలోన్‌) ఈ క్యూ2లో రూ.65,430 కోట్లకు ఎగసిందని రజనీష్‌ తెలిపారు. మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్‌) రూ.72,918 కోట్ల నుంచి రూ.74,949 కోట్లకు పెరిగిందని వివరించారు.