ఒక ఓవర్ లో 40 పరుగులు..!

0steve-mccomb-scores-40-runsఏ స్థాయి క్రికెట్లోనైనా ఓవర్ లో 30 పరుగులు సాధించడమంటేనే అసాధారణ బ్యాటింగ్ గా భావిస్తాం. మరి అంతకుమించి పరుగులు సాధిస్తే అది చరిత్ర గుర్తించుకోదగ్గ అద్భుతంగానే చెప్పుకోవాలి. ఇటీవల యూకే క్లబ్ జట్టు డార్కెస్టర్ జట్టు ఆఖరి ఓవర్ లో 40 పరుగులు సాధించి మరపురాని గెలుపుని అందుకుంది.

ఆక్స్ఫర్డ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఇంగ్లండ్ విలేజ్ క్రికెట్ మ్యాచ్ లో డార్కెస్టర్-స్విన్ బ్రూక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే స్విన్ బ్రూక్ విసిరిన 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన డార్కెస్టర్ కు చివరి ఓవర్ లో 35 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో ఆఖరి ఓవర్ ను స్విన్ బ్రూక్ బౌలర్ మిహాయ్ కూకాస్ బంతిని అందుకోగా, క్రీజ్ లో స్టీవ్ మెక్ కాంబ్ ఉన్నాడు. తొలి బంతి నో బాల్ కావడంతో పాటు దాన్ని స్టీవ్ సిక్సర్ గా మలచాడు. దాంతో ఏడు పరుగులొచ్చాయి. ఆ తర్వాత వెంటనే సిక్స్. దాంతో మొదటి బంతి పూర్తయ్యేసరికి 13 పరుగులొచ్చాయి.

ఇక రెండో బంతి డాట్ బాల్ కావడంతో మిగిలిన నాలుగు బంతుల్లో 22 పరుగులు అవసరయ్యాయి. మూడో బంతికి ఫోర్ సాధించాడు. ఆ తరువాత నాల్గో బంతి కూకాస్ లైన్ తప్పి మళ్లీ నో బాల్ వేశాడు. ఆ బంతిని కూడా ఫోర్ గా కొట్టడంతో అక్కడ ఐదు పరుగులొచ్చాయి. ఆపై పూర్తిచేసిన నాల్గో బంతి సిక్స్ తో పాటు ఐదు, ఆరు బంతుల్ని కూడా భారీ సిక్సర్లుగా మలచడంతో ఏకంగా 40 పరుగులొచ్చాయి. మొత్తంగా చూస్తే ఆఖరి ఓవర్ లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లు వచ్చాయి.