స‌న్నీ లియోన్ కండోమ్ యాడ్స్‌ను ఆపండి!

0sunny-leone-spicy-picబాలీవుడ్ శృంగార తార స‌న్నీ లియోన్ న‌టించిన కండోమ్ యాడ్స్‌ను గోవా రాష్ట్ర బ‌స్సుల్లో రాకుండా ఆపాల‌ని అక్క‌డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆండ్రీ ఫ్రాన్సిస్ సిల్వీరా డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇది మ‌న‌కు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని లేవ‌నెత్తే ముందు అసెంబ్లీలో కండోమ్ అన్న ప‌దం ఉప‌యోగించ‌వ‌చ్చా అని ఆయ‌న స్పీక‌ర్ ప్ర‌మోద్ సావంత్‌ను అడిగారు. ఇలాంటి యాడ్స్ గోవా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ బ‌స్సుల‌ను మ‌న విద్యార్థులు, ప్ర‌జ‌లు ర‌వాణా కోసం ఉప‌యోగిస్తున్నారు అని సిల్వీరా అన్నారు. స‌ద‌రు కండోమ్ సంస్థ‌తో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం క‌దంబ ట్రాన్స్‌పోర్ట్ బ‌స్సుల్లో ఈ యాడ్స్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.