పవన్ కోసం కథలు రెడీ అట..

0

పవన్ కళ్యాన్ భవితవ్యం మే 23న తేలనుంది. విజయమో.. వీర నిష్క్రమణ అనేది ఆ రోజే స్పష్టమవుతుంది. ఏపీలో రాజకీయ నడపడమా? లేక తిరిగి సినిమాల వైపు చూడడమా అనేది కూడా ఖాయమవుతుంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే పవన్ తిరిగి సినిమాల్లోకి వస్తారనేలానే పరిస్థితులు కనిపిస్తున్నాయని జనసేన వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే పవన్ రాజకీయాలు వదలుతాడో లేదా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ పవన్ సినిమా చేద్దామనే ఆలోచన వస్తే మాత్రం ఆయన కోసం రెడీగా ఉండాలని పలువురు రచయితలు కథలను సిద్ధం చేస్తున్నారని తాజా సమాచారం. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు పవన్ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. పవన్ ఒక్కమాట సై అంటే చాలు సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా బడా మూవీ మేకర్స్ తోపాటు చాలా మంది నిర్మాతలు సిద్దంగా ఉన్నారట..

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తర్వాత పవన్ పలు రిమేక్ లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సడన్ గా రాజకీయాల బాట పట్టడంతో నిర్మాతలు దర్శకులు ఎదురుచూస్తు ఉండిపోయారు. ఇన్ని రోజులు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు అక్కడ మెరుగైన ఫలితం రాకపోతే సినిమాల్లో వచ్చే ఆలోచన చేస్తారా? లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. పవన్ గనుక వస్తే ఆయన కోసం స్క్రిప్ట్ లు రెడీగా ఉంచేందుకు నిర్మాతలు ఇప్పటికే రచయితలకు చెప్పినట్టు సమాచారం. పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ ఎప్పుడూ పవన్ కోసం కొన్ని కథలు రెడీ చేసుకునే ఉంటాడు కాబట్టి ఆయనతో సినిమాలకు ఎప్పుడూ సిద్ధమే. మరి పవన్ మే 23 తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
Please Read Disclaimer