ప‌వ‌న్-మ‌హేష్‌ల‌ మ‌ల్టీస్టార‌ర్ క‌థంట‌!

0pavan mahesh multistarrerమ‌ల్టీస్టార‌ర్ హంగామా టాలీవుడ్‌లో హోరెత్తిస్తోంది. క‌థ కుద‌రాలేగానీ ఇద్దరు క‌థానాయ‌కులు జోడీక‌ట్టడానికి రెడీ అంటున్నారు. అందుకే షాకిచ్చే కాంబినేష‌న్లు సెట్ అవుతున్నాయి. అలాంటి ఓ కాంబినేష‌న్ – ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మహేష్ బాబు. వీరిద్దరూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్‌క‌థానాయ‌కులు. వీరిద్దరూ క‌లిస్తే… చిత్రసీమ‌లో అదో పెను సంచ‌న‌లం. స‌రైన క‌థ దొరకాలే గానీ, క‌ల‌సి న‌టించ‌డానికి వీరికీ అభ్యంత‌రాలేం ఉండ‌క‌పోవ‌చ్చు.

అలాంటి క‌థ నా ద‌గ్గర ఉంది.. అంటున్నాడు ఓ ద‌ర్శకుడు. అత‌నెవ‌రో కాదు ఓంకార్‌. బుల్లితెర‌పై రియాలిటీషోల‌తో త‌న‌కంటూ ఓ క్రేజ్ తెచ్చుకొన్నాడు. దర్శకుడిగా జీనియ‌స్ అనిపించుకోవాల‌ని భంగ‌ప‌డ్డాడు. అయితే త‌న నుంచి మ‌రో సినిమా వ‌స్తుంద‌ని, ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ రాసుకొన్నాన‌ని, ఆ క‌థ‌కి ప‌వ‌న్ – మ‌హేష్ లు అయితేనే న్యాయం చేయ‌గ‌లర‌ని అంటున్నాడు ఓంకార్‌.

మ‌రి ఆ క‌థ‌కు నిజంగానే అంత సీన్ ఉందంటారా? ప‌వన్‌, మ‌హేష్‌ల‌ను ఒప్పించి ఈ క‌థ‌ను తెర‌కెక్కించ‌గ‌ల‌డంటారా.??