అందుకే నటనకు దూరమయ్యా: స్నేహా ఉల్లాల్

0sneha-ullal-hotబాలీవుడ్ “లక్కీ” సినిమాలో స్నేహా ఉల్లాల్ కనిపించినప్పుడు ఐష్వర్యా రాయ్ పోలికలతో ఉన్న ఈమె ఖచ్చితంగా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తుందీ అనుకున్నారంతా. అప్పటికే ఐష్ తో విడి పోయిన సల్మాన్ కూడా స్నేహ కి సపోర్ట్ గా ఉండటం తో ఇక తనకి తిరుగు లేదనే అనుకున్నారు. కానీ విధి రివర్స్ గేం ఆడింది. రావటమే పెద్ద హైప్ తో వచ్చిన స్నేహా ఉల్లాల్ తర్వాత బాలీవుడ్ లో నిరాదరణకు గురైంది ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్ నుంచి దక్షిణాది వైపు అడుగులేసింది…

ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్నేహా ఉల్లాల్. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘కరెంట్’, ‘సింహా’ కెరీర్ లో సింహ లాంటి భారీ చిత్రాలతో ఫర్వాలేదనిపించుకుంది. ఇదే సమయంలో వెన్ను గాయానికి గురవడం ఆమెకి కష్టాలు తెచ్చిపెట్టింది.

విశ్రాంతి తప్పనిసరి కావడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆమెకి తెలుగులో కానీ, తమిళంలో కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు. దాంతో నిరాశకు గురైన ఆమె తిరిగి బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టి టాలీవుడ్ లో చాలానే అవకాశాలు దక్కినా వాటిని అందుకోవడంలో విఫ‌ల‌మైంది.

టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నపుడే మళ్ళీ బాలీవుడ్ పై కన్నేయడంతో స్నేహా ఉల్లాల్ కు ఇక్క‌డకూడా అవ‌కాశాలు లేకుండా పోయాయి. అదే సమయం లో ఉన్నట్టుండీ మాయమైపోయింది. దాదాపుగా మూడేళ్లుగా సినిమాలకు దూరమైపోయింది. వార్తల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. అంతా దాదాపుగా మర్చి పోతున్న దశలో హఠాత్తుగా ఊడిపడింది.

ఇన్నాళ్ళూ తాను నటనకు దూరం కావటం వెనుక రహస్యాన్ని చెప్పింది. పాపం ఆరోగ్యకారణం వల్లే ఇన్నాళ్ళూ కనిపించకుండా పోయిందట. ఇందుకు తనకు గల ఒక వ్యాధి కారణం అని చెప్పింది స్నేహా ఉల్లాల్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు బ్రేక్ తీసుకోవాలని తాను అనుకోలేదని.. తన వ్యాధి కారణంగా ఇలా గ్యాప్ ఇవ్వక తప్పలేదని చెప్పింది స్నేహా ఉల్లాల్.

‘రక్తానికి సంబంధించిన ఒక వ్యాధితో బాధ పడ్డాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా నేను మరీ బలహీనంగా మారిపోయాను. నా అంతట నేను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేకపోయేదాన్ని. దీంతో 2014 వరకు నాకు ఉన్న కమిట్మెట్స్ ను పూర్తి చేసేసి గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు’ అని చెప్పింది స్నేహా ఉల్లాల్.