మోదీనే పెళ్లాడతా: జయశాంతి

0jaya-santiనిత్యం ధర్నాలతో దద్దరిల్లిపోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విచిత్ర వాతావరణం చోటుచేసుకుంది. ఒక మహిళ పెళ్లంటూ చేసుకుంటే ప్రధాని మోదీనే చేసుకుంటానని ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన జయశాంతి(45) అనే మహిళ గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ప్రధాని నరేంద్ర మోదీని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. పైగా తనను మోదీ అర్థం చేసుకుంటారని పేర్కొంది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం జయశాంతికి 1989లో వివాహమైంది. ఆమె భర్త ఒక సంవత్సరం తరువాత ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది. తరువాత ఆమెను వివాహం చేసుకునేందుకు చాలామంది ముందుకువచ్చినా ఆమె నిరాకరించింది. తాజాగా ఆమె ప్రధాని మోదీని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నది. అలాగే తనకున్న ఆస్తులను అమ్మి మోదీకి రెండు కోట్ల రూపాయలను కట్నంగా ఇస్తానని కూడా తెలిపింది. ఇక్కడి నుంచి తనను పంపిస్తే మోదీ