కొత్త స్టైల్ చూపనున్న సహజ నటి

0nivetha-thomas-picటాప్ టెన్ సౌత్ హీరోయిన్లు లిస్ట్ ఒకటి తయారు చేస్తే అందులో మొదటి 5 మందిని వదిలిస్తే మిగతా 5గురు మాత్రం మారుతూ ఉంటారు. అలా మారుతున్నప్పుడు కొన్ని కొత్త మొఖాలు వచ్చి తమ అమాయకపు నటనతో అందరికి గుర్తుండి పోయేలాగా ఉండిపోతాయి. ఇప్పుడు మన తెలుగులో కూడా ఒక హీరోయిన్ తన సహజ నటనతో హీరోలుకు మంచి పోటీగా నిలుస్తుంది. ఆమె పేరే నివేతా థామస్. జెంటిల్ మాన్ సినిమాలోని తన నటనతో అందరిని ఆకట్టుకొని ఇప్పుడు నిన్ను కోరి సినిమాతో మరో సారి తన నటనతో ఆ పాత్రకు జీవం పోసింది.

ఈ రెండు సినిమాలులలో ఈమె చూడటానికి సాదాగా కనిపించినా ఇప్పుడు రాబోతున్న జై లవ కుశ సినిమాలో కొత్తగా కనిపించబోతుంది. ఈ సినిమాలో నివేతా పాత్ర గురించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా చూసుకుంటున్నారు జై లవ కుశ టీమ్. తన స్టైలిష్ లుక్ తో థియేటర్ లో అందరిని షాక్ చేయబోతుంది అని కూడా అంటున్నారు. అల్లు అర్జున్ ఎన్టీఆర్ కు ఫ్యాషన్ స్టైలిస్ట్ గా పని చేసిన అశ్విన్ ఈ సినిమాలో నివేతా థామస్ కు కొత్త లుక్ సెట్ చేసినట్లు టాక్. ఇంత వరకు నటిగా చూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాతో స్టార్ నివేతా రూపం ఎలా ఉండబోతుందో చూస్తారట.

ఫ్యాషన్ స్టైలిస్ట్ అశ్విన్ ఇప్పుడు నివేత స్టైల్ గురించి చిన్న క్లూ ఇస్తూ. “ఇంత అందమైన ఆత్మ కు అందాన్ని మరింత స్టైలిష్ గా చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు” అంటూ ఆ లుక్ ను రివీల్ చేశాడు. ఈ ఒక్క ఫోటో సరిపోతుంది ఏమో ఆమె ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో ఊహించుకోవడానికి. దసరా వరకు ఆగండి ఈ కొత్త దేవి అవతారం చూడటానికి.