సమంత స్టైలిస్ట్ కు పెను ప్రమాదం

0

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో పలువురు స్టార్స్ కు స్టైలిస్ట్ గా – కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన పల్లవి సింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై అయ్యింది. ప్రమాదాన్ని ముందే గమనించి ఆమె దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణించిన కారు ఏకంగా కాళీ బూడిద అయ్యింది.

ఉబర్ క్యాబ్ లో ఆమె ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్పుకొచ్చింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రయాణికుల భద్రతకు ఉబర్ తీసుకునే చర్యలు ఏంటి అంటూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉబర్ లో ప్రయాణికుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగా లేదని ఆమె పేర్కొంది.

కారులో ప్రయాణిస్తున్న సమయంలో మంటలు వస్తున్న విషయాన్ని నేను ముందుగా చూసి డ్రైవర్ కు చెప్పాను. ఇతర వాహనాల వారు కూడా మంటల విషయాన్ని చెప్పుకొచ్చింది. అప్పుడు వెంటనే నేను కారు నుండి దిగినట్లుగా చెప్పింది. కారులో తన వ్యాలేట్ మరియు ఐడి కార్డుతో పాటు ఇంకా పలు వస్తువులు కూడా కాలిపోయాయని ఆమె చెప్పింది. ఉబర్ ఈ విషయం పై వెంటనే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Please Read Disclaimer