నో డౌట్ : శ్రీదేవిది హత్యే !

0శ్రీదేవి మరణవార్త తొలిసారి లోకానికి వెల్లడికాగానే దేశమంతా ఒక్కసారిగా షాక్‌ అయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తల్లడిల్లిపోయారు. సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఐతే ఈ మరణం క్రమంగా అనుమానాలు తావిస్తుంది. ఆమె మరణం అనుహ్యమైన మలుపులు తిరుగుతోంది.

తాజాగా శ్రీదేవి మరణం పై బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ్రీ‌దేవిది హ‌త్యే.. అని తేల్చేశారాయ‌న‌. శ్రీ‌దేవికి మ‌ద్యం తాగే అల‌వాటు లేద‌ని, ఎవ‌రో బ‌ల‌వంతంగా మ‌ద్యం తాగించార‌ని, ఆ రాత్రి శ్రీ‌దేవి హోటెల్‌కి ఎవ‌రెవ‌రు వెళ్లారో తేలాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆ హోటెల్ తాలుకూ… సీసీ టీవీ ఫుటేజ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎందుకు బ‌య‌ట‌కు రాలేద‌ని ప్ర‌శ్నించారు. బాలీవుడ్‌కీ ముంబై మాఫియాకీ మ‌ధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారాయ‌న‌. దీంతో ఇప్పుడు ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది.