సుచీ లిక్స్ లో జెనీలియా ఫోటోస్

0Suchileaks-latest-target-acసుచీ లీక్స్ పేరుతో గత పది రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, త్రిష, సింగర్ చిన్మయి, నయనతార, సంచితా శెట్టి ఇలా పలువురు స్టార్స్ గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సుచీ లీక్స్ ద్వారా లీకైన ఫోటోలు, వీడియోలు, సెలబ్రిటీల రహస్య జీవితానికి సంబంధించిన విషయాలు…. సినీ ప్రేక్షకుక లోకాన్ని, సాధారణ ప్రజానీకాన్ని షాకయ్యేలా చేశాయి. పలువురు సెలబ్రిటీల జీవితాల్లోని చీకటి కోణాలు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

సందెట్లో సడేమియాలా సుచీ లీక్స్ ముసుగులో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హీరోయిన్ జెనీలియాకు సంబంధించిన బూతు ఫోటోలు ఇంటర్నెట్లో రిలీజ్ చేసి ఇది సుచీ లీక్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

అయితే జెనీలియాకు సంబంధించిన ఆ బూతు ఫోటోస్ అన్నీ మార్ఫింగ్ చేసినవే అని స్పష్టం అవుతోంది. జెనీలియాతో పాటు మరికొందరు హీరోయిన్ల ఫోటోలు కూడా పోర్న్ ఫోటోలతో మార్పింగ్ చేసి రిలీజ్ చేస్తుండటంతో పలువురు స్టార్స్ ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుచీ లీక్స్ వ్యవహారంలో హీరోయిన్ సంచిత శెట్టికి సంబంధించిన న్యూడ్ వీడియో రిలీజ్ కావడం అత్యంత దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. తనది కాని వీడియోను తనదిగా ప్రచారం చేయడాన్ని సంచిత శెట్టి తీవ్రంగా ఖండించారు.

సుచి లీక్స్ వెనక ప్రధానం ఉన్నది సింగర్ సుచిత్ర అని అంటున్నారు. అయితే ఆమె లీక్ చేసింది తాను కాదు తన అకౌంట్ హ్యాక్ అయిందని వాదిస్తోంది. ఆమె భర్త కార్తీ తన భార్య మానసిక స్థితి బాగోలేదని అంటున్నారు….. ఈ గంధరగోళంలో ఏం చేయాలో అర్థం కాక బాధిత సెలబ్రిటీలు తలపట్టుకుంటున్నారు.