అతిగా ఆశించొద్దు..రక్షిత్ కు సుదీప్ సలహా

0రష్మిక మందాన.. కన్నడ నాట ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కన్నడ హీరో రక్షిత శెట్టితో కలిసి తీసిన ఆ సినిమా హిట్ అయ్యింది. కానీ ఆ సినిమా షూటింగ్ లోనే మనసులు కలవడంతో రష్మిక-రక్షిత్ లు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ.. సినిమా పూర్తై విడుదలయ్యాక ఎంగేజ్ మెంట్ వరకూ చేరింది. అవకాశాలు లేకపోవడం.. హీరో కావడంతో రష్మికా ఆ సమయంలో పెళ్లికే మొగ్గు చూపింది. కానీ గీతా గోవిందం మూవీ రక్షిత్ కొంపముంచింది. రష్మిక భవిష్యత్ కు భరోసానిచ్చింది. అందుకే అందివచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ పెళ్లి అనే తంతును రష్మిక వాయిదా వేసింది. ఇది వారిద్దరి మధ్య మనస్పర్థలకు దారితీసి.. ప్రేమ కథ కంచికి.. రష్మికా మందాన సినీ ఇండస్ట్రీకి చేరిపోయింది.

ఈ మొత్తం వ్యవహారంలో రష్మికపై చాలా ఆరోపణలు వచ్చాయి. రష్మిక ‘గీతా గోవిందం’ గ్రాండ్ హిట్ తర్వాత ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అగ్రహీరోలతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంది. దీంతో తన తొలి సినిమా హీరోను నిర్లక్ష్యం చేసింది. సినీ మాయలో స్టార్ హోదాలో ఇప్పుడే పెళ్లి నై అంది.. దీంతో వారి మధ్య గొడవలు.. జరిగి ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ అయిపోయిందని ప్రచారం జరిగింది.

తాజాగా రష్మికపై ట్రోలింగ్ లు విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై ఆమె మాజీ ప్రియుడు హీరో రక్షిత్ ఫేస్ బుక్ లో స్పందించాడు. రష్మికతో తన ఎంగేజ్ మెంట్ బ్రేకప్ జరిగింది వాస్తవమేనని వివరణ ఇచ్చాడు.రష్మిక గురించి ఏదో ఊహించుకోకండని.. ఆమెపై తప్పుడు ప్రచారం చేయవద్దని అభిమానులను కోరారు. రష్మికతో పెళ్లి రద్దు అవడానికి చాలా కారణాలున్నాయని.. ఏదో ఊహించుకొని రష్మిక ను అభాసుపాలు చేయవద్దని కోరారు. ఆమెను ప్రశాంతంగా బతకనివ్వండని అభిమానులకు సూచించారు. త్వరలోనే మా ప్రేమ పెళ్లి రద్దుపై నిజాలు చెప్తానని ఫేస్ బుక్ లో భారంగా రాసుకొచ్చాడు.

రష్మిక మందానాతో తన ఎంగేజ్ మెంట్ రద్దుపై హీరో రక్షిత్ శెట్టి హుందాగా స్పందించిన తీరుకు కన్నడ అగ్ర నటుడు సుదీప్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. భావోద్వేగాల సమయంలో రక్షిత్ హుందాగా – మెచ్చురిటీగా వ్యవహరించావని కొనియాడారు. నీకు భగవంతుడు అన్ని రకాల మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఎదుటి వ్యక్తి నుంచి ప్రతీది ఎక్కువగా ఆశించడం తప్పు అని సుదీప్ తెలిపాడు. సినీ ప్రముఖులకు కూడా ఎమోషన్స్ ఉంటాయని.. వాటిని పబ్లిక్ చేయవద్దని సుదీప్ నెటిజన్లు మీడియాకు సూచించారు.

ఇక రష్మిక-రక్షిత్ ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ అయిపోందని రష్మిక తల్లి సుమన్ మందానా స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని.. దాంతో సరిద్దిదేందుకు ప్రయత్నించినా వీలు కాని పక్షంలో ఇరు కుటుంబాలు నిశ్చితార్థం రద్దు చేయాలని నిర్ణయించాయని ఆమె ప్రకటించారు. దీంతో రష్మిక-రక్షిత్ ప్రేమకు ఎండ్ కార్డ్ పడింది.