హాలీవుడ్ లోకి కిచ్చ సుదీప్ ఎంట్రీ!

0Sudeep-In-Hollywood-Filmటాలెంట్ ఉండి ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు ముందుకు వచ్చే నటులకు భాష అడ్డుకాదని కిచ్చ సుదీప్ నిరూపించాడు. కన్నడ ఇండస్ట్రీలో సుదీప్ కు మంచి పేరుంది. తన విలక్షణ నటనతో ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలడు సుదీప్. కన్నడ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ యాక్టర్ కు తెలుగులో కూడా అభిమానులున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా సుదీప్ అద్భుతంగా నటించాడు. ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈగ సినిమాలో విలన్ గా నటించిన సుదీప్ ఏకంగా నంది అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి-ల లో కూడా సుదీప్ కు చిన్న పాత్ర కల్పించారు రాజమౌళి. అయితే సుదీప్ త్వరలోనే బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటబోతున్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ జిందా హై సినిమాలో సుదీప్ విలన్ గా నటిస్తున్నాడని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. సల్లూభాయ్ నటించిన ఏక్ థా టైగర్ కు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతోంది. సల్మాన్ సినిమాలో విలన్ గా నటిస్తుండడంతో బాలీవుడ్ లో కూడా సుదీప్ పాగా వేసినట్లేనని అభిమానులు అనుకుంటున్నారు. అంతే కాదండోయ్ సుదీప్ త్వరలో ది రైజెన్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు సుదీప్ ఆస్ట్రేలియా వెళ్లబోతున్నాడని సమాచారం. కన్నడ – తమిళ్ – తెలుగు – హిందీ భాషల్లో సత్తా చాటిన సుదీప్ హాలీవుడ్ లో ఎంతవరకు రాణిస్తాడో వేచి చూడాలి.