సైరా లో కిచ్చ ఫస్ట్ లుక్ రచ్చ!

0ఒకే భాషకు పరిమితమైన నటులు చాలామంది ఉంటారు.. కానీ కొంతమంది మాత్రం భాష అనే హద్దులను పూర్తిగా చెరిపేసి అందరి అభిమానం చూరగొంటారు. అలాంటి అతి కొద్దిమంది నటులలో కన్నడ స్టార్ ‘కిచ్చ’ సుదీప పేరు మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. మనం ఆయనను సుదీప్ అని పిలుచుకుంటాం! మాతృభాష కన్నడ అయినా.. తెలుగు – తమిళ – హిందీ సినిమాలలో నటించి అందరినీ మెప్పించాడు.

‘ఈగ’ తో యుద్ధం చేసి తెలుగు వారి మనస్సుల్లో పర్మనెంట్ గా ఎకౌంటు ఓపెన్ చేసుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సెప్టెంబర్ 2 వ తేదీ సుదీప్ పుట్టిన రోజు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.. ఈ కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పుట్టిన రోజు ఒకే రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ‘సైరా’ టీమ్ సుదీప్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సుదీప్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో సుదీప్ అవుకురాజు అనే పాత్ర పోషిస్తున్నాడని వెల్లడించారు మేకర్స్.

పూర్తిగా నలుపు రంగు కాస్ట్యూమ్ లో ఉన్న సుదీప్ నలుపు రంగు తలపాగాతోనే కనిపించాడు. పొడవాటి జుట్టు.. బాగా పెరిగిన గడ్డం.. మెలితిప్పిన మీసాలు.. నుదుటన తిలకం తో పవర్ఫుల్ గా ఉన్నాడు. ఇక భుజాన గొడ్డలి.. నడుము భాగంలో ఒక ఖడ్గంతో ఒక లాంటి లుక్ ఇచ్చాడు. పోస్టర్ వెనక మంటలు విధ్వంసం.. బ్రిటిష్ సైనికులు గుర్రాలపై ఉన్నారు. మరి ఈ అవుకురాజు ఏం చేస్తాడో తెలియాలంటే మనం కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.