నాని వల్ల ఆ హీరోకు కలిసొస్తుందా?

0

నిన్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబుల కాంబినేషన్ లో వి అనే సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సున్నితమైన కథాంశాలతో హృద్యమైన భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరిస్తారని పేరున్న ఇంద్రగంటితో నానికి ఇది మూడో సినిమా. అష్టాచెమ్మా లైఫ్ ఇవ్వగా జెంటిల్ మెన్ కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యింది.

ఇప్పుడు వి ఫలితం ఎలా ఉండబోతోంది అనేది పక్కన పెడితే నాని కన్నా ఎక్కువగా సుధీర్ బాబుకి దీని బ్రేక్ చాలా అవసరం. తన సినిమాలు ప్రేక్షకులు పాస్ చేస్తున్నా వసూళ్ళ పరంగా ఎలాంటి అద్బుతాలు చేయలేకపోతున్నాయి.. సమ్మోహనం బాగానే వర్క్ అవుట్ అయినా పాజిటివ్ టాక్ తో సైతం నన్ను దోచుకుందువటే కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది

అందుకే ఇప్పుడీ వి చాలా కీలకంగా మారింది. ఏ జానర్ అనేది బయటికి చెప్పకపోయినా జెంటిల్ మెన్ తరహలో క్రైమ్ థ్రిల్లర్ అనే ఇన్ సైడ్ టాక్ బలంగా ఉంది. సుధీర్ బాబు మార్కెట్ పెరగాలి అంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. నానికి కొత్తగా మార్కెట్ పరంగా పెరిగేది తగ్గేది ఏమి లేదు. ఆల్రెడీ స్ట్రాంగ్ గా సెటిలైపోయాడు. ఎటొచ్చి సుదీర్ బాబుకే ఇది ప్లస్ అవ్వాలి.

నివేదా థామస్ ఆదితి రావు హైదరి హీరొయిన్లుగా నటిస్తున్న ఈ విలో నాని సరసన ఎవరు అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. మహేష్ ఫ్యామిలీ అనే స్టాంప్ నుంచి బయటపడి తనకంటూ స్వంత ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్న సుధీర్ బాబుకి నాని ఎంత వరకు హెల్ప్ అవుతాడో వి రిలీజయ్యాకే తెలుస్తుంది
Please Read Disclaimer