షుగర్ బిస్కెట్: శక్తికి పూనమ్ కి నిర్వచనం!

0

కొన్నిటికి లాజిక్కులు ఉండవు. మన అరవై ఏళ్ళ హీరోలు 25 ఏళ్ళ హీరోయిన్ల తో రొమాన్స్ చేస్తే మనం భలే భలే అని చంకలు గుద్దుకుంటాం. తాతలు అయి ఉండి కూడా ఈ వయసులో చేసే వీళ్ళ ముష్టి రొమాన్స్ ను మనం భరిస్తూనే ఉంటాం. కానీ అదే 66 ఏళ్ళ శక్తి కపూర్ 27 ఏళ్ళ పూనమ్ పాండే తో మిడ్ నైట్ మసాలా లాంటి సినిమా చేస్తే మాత్రం ఓ అని విమర్శకులు రెచ్చిపోతారు. ఇదేం లాజిక్కో.. ఆ బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాదేమో.

సరే.. కొన్ని అర్థం కాని విషయాలు ప్రపంచం లో ఉంటాయని సరిపెట్టుకుందాం. హాట్ బ్యూటీ పూనమ్ పాండే లీడ్ రోల్ లో ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే పేరుతో ఒక అడల్ట్ కంటెంట్ థ్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా నుండి షుగర్ బిస్కెట్ అనే ఒక ఘాటు రొమాన్స్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పాట బాగానే ఉంది కానీ ఇందులో స్పెషల్ ముసలి శక్తి కపూర్ ను కసక్కులా ఉండే పూనమ్ పాండే తన అందాలను ఆరబోస్తూ ఊరించడం.. ఆ తర్వాత ఆయన ఈ ఘాటు బ్యూటీ ని ఎత్తుకోవడం.. అబ్బో మామూలుగా లేదు. పేరులోనే శక్తి ఉంది కాబట్టి ఆయనకు ఒజోమెన్ లు వయాగ్రా పిల్స్ అవసరం లేదేమో. ఇమ్రాన్ హష్మీ హీరోయిన్లను ఎలా ఎత్తుకుంటాడో అలా అవలీలగా పూనమ్ ను ఎత్తి ఘాటు రొమాన్స్ చేస్తున్నాడు.

ఇక ఈ పాటకు నెటిజనుల సెటైర్లు మామూలుగాలేవు. ఒక నెటిజన్ “శక్తి అప్నీ శక్తీ కా గలత్ ఇస్తేమాల్ కర్ రహా హై”(శక్తి తన శక్తి ని తప్పుగా వాడుతున్నాడు) అంటే మరొకరు “షరమ్ కరో ఏ 1988 నహీ.. 2018 హై.. తుమ్ బుడ్డా బన్ చుకే హో”(సిగ్గుపడు శక్తి.. ఇది 1988 కాదు.. 2018 నువ్వు ముసలివాడయ్యావు)… “మస్తీ కరో బడ్డే. తేరా లాటరీ లగీ హై”(ఎంజాయ్ చెయ్ ముసలోడా.. నీకు లాటరీ తగిలింది) ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కామెంట్లు ఉన్నాయి. మరి అంతలోపు ఆ షుగర్ టాబ్లెట్.. సారీ షుగర్ బిస్కట్ మీరు ఒకసారి తినండి.
Please Read Disclaimer