రాజకీయాల్లోకి మేము కూడా వస్తాము: సుహాసిని

0Suhasiniతమిళనాట రాజకీయాల్లోకి రావడానికి చాలా మందే మొగ్గుచూపుతున్నారు అని అర్ధమవుతున్నది. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు సూపర్ స్టార్స్ అయిన రజినీకాంత్ & కమల్ హసన్ రాజకీయ ఆరంగేట్రం కొరకు ప్రయత్నిస్తుండగా వీరికి తామేమి తక్కువ కాదంటూ తమిళ నటీమణులు కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కావాలని కోరుకుంటున్నారు.

ఇందులో భాగంగానేనటి సుహాసిని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాజకీయాలు ఒక్క హీరోలకే పరిమితం కాదని, అలా అయితే మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత ఎవరు అని ఆమె ప్రశ్నించారు. తమలో కూడా రాజకీయ చైతన్యం ఉందని అవకాశం వస్తే తాము కూడా చట్టసభల్లో రాణిస్తాము అని కుండబద్దలు కొట్టేసింది.

నటీమణులలో ఖుష్బు, నగ్మా ఇప్పటికే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటుండగా ఇప్పుడు సుహాసిని చేసిన కామెంట్స్ తో తన రాజకీయ రంగప్రవేశం త్వరలోనే ఉండబోతున్నది అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.