సాహో గురించి అలా చెప్పాడండీ

0భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే ఆ సినిమాలకు సంబందించిన విషయాలు ఒక్కటి కూడా బయటకు వెళ్లోద్దని చిత్ర యూనిట్ సభ్యులు చాలా జాగ్రతలు తీసుకుంటారు. అలాగే మీడియాతో కూడా ఎక్కువగా కలవరు. సినిమా అంశాలను సీక్రెట్ గా ఉంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం సాహో దర్శకుడు కూడా అదే తరహాలో చేస్తున్నాడు. సినిమా షూటింగ్ గురించి తప్పితే కథ కథనం ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు బయటకు రాలేదు.

అయితే ఈ సినిమాకు సంబందించిన విషయాలను సుజీత్ గల్ఫ్ మీడియాతో పంచుకున్నాడట. గత కొన్ని వారల క్రితమే సాహో టీమ్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. 40 రోజుల షెడ్యూల్ ని ఇటీవల పూర్తి చేసుకున్నారు. సాహో షూటింగ్ కోసం సహకరించిన టూఫోర్54 మీడియా హబ్ గురించి దర్శకుడు గొప్పగా చెప్పాడు. ఒక పెద్ద టీమ్ తో షూటింగ్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు.

కానీ మాకు అన్ని విధాలుగా ఇక్కడ సపోర్ట్ దొరికింది. మరోసారి షుటింగ్ చేయాలనీ ఉన్నట్లు దర్శకుడు తెలిపాడు. అలాగే చిత్ర కథానాయకుడు ప్రభాస్ కూడా తనదైన శైలిలో అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. చాలా కష్టపడి చేసిన యాక్షన్ సీన్స్ కు మంచి సౌకర్యాలు లభించినట్లు చెబుతూ.. అబుదాబిని మరచిపోలేము అని కితాబిచ్చాడు.