ప్రభాస్ తో కామెడీ ట్రై చేస్తున్న సుజిత్

0


Sujith-and-prabhasబాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సాహో పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బాహుబలి వంటి సీరియస్ సబ్జెక్ట్ తో జనాల్ని ఆకట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు సాహోలో ఓ కామెడీ హీరోగా నటిస్తున్నాడని తెలిసింది. రన్ రాజా రన్ లో శర్వానంద్ తో కామెడీ చెయించి ఆ సినిమాని సక్సెస్ వైపు నడిపించిన దర్శకుడు సుజిత్ అదే ఫార్ములాని ప్రభాస్ పై కూడా వాడబోతున్నాడని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అయితే కామెడీతో పాటు కాస్త యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సాహోలో ఉండబోతున్నాయట.

బాహుబలితో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ ఆ రేంజ్ ను మరింత పెంచుకోవడానికి కామెడీ జానర్ కూడా ట్రై చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక గతంలో ప్రభాస్ కామెడీ ట్రై చేసిన పౌర్ణమి – బుజ్జిగాడు – ఏక్ నిరంజన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. డార్లింగ్ కాస్త బెటర్ అనిపించినా కామెడీ జానర్ ప్రభాస్ కి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సాహో కోసం మరోసారి ప్రభాస్ కామెడీ కథని ఎంచుకోవడం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రభాస్ ఎంచుకున్న పాయింట్ సరైనదో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.