ప్రభాస్ సినిమా ఫై సుక్కు క్లారిటీ…

0సుకుమార్..ప్రస్తుతం ఈ పేరు ఫిలిం సర్కిల్లో హాట్ హాట్ గా వినపడుతుంది..రంగస్థలం తో మొదటిసారి కమర్షియల్ హిట్ కొట్టి అందరి చూపు పడేలా చేసుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుండే కలెక్షన్ల సునామి సృష్టిస్తూ చరణ్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అయ్యింది.

విభిన్న కథాంశాలతో మ్యాజిక్‌లు చేసే సుకుమార్.. మొదటిసారి తన రూట్‌కు భిన్నంగా కమర్షియల్ పంథాలో సినిమాను తీసి సక్సెస్‌ను సాధించారు. ఈ నేపథ్యం లో తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ తోనేనని వార్తలు ప్రచారం కావడం తో ఆ వార్త ఫై క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసారు. ఈ మధ్య ప్రభాస్‌ను అసలు కలవలేదనీ, కనీసం ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఎదురుపడలేదని సుకుమార్ తెలిపాడు.