సుకుమార్ చిన్న సినిమా ముచ్చట్లు

0స్టార్ డైరెక్టర్ సుకుమార్ నుంచి అప్పుడప్పుడూ చిన్న సినిమాలు కూడా వస్తుంటాయి. ఇంతకుముందు తన శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రానికి స్క్రిప్టు అందించడంతో పాటు తనే ఆ చిత్రాన్ని నిర్మించాడు కూడా. ఆ తర్వాత తన మిత్రుడు హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘దర్శకుడు’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ‘కుమారి 21 ఎఫ్’ లాగా ఇది హిట్టవలేదు. అలాగని సుకుమార్ ఇలాంటి ప్రయత్నాలు ఆపేయడం లేదు. త్వరలోనే సుక్కు ప్రొడక్షన్లో మరో సినిమా రాబోతోంది. అతడితో ‘రంగస్థలం’ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఇందులో భాగస్వామి కాబోతోంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.