ప్రభాస్ తో ఎలాంటి సినిమా ఉంటుందో?

0

రంగస్థలం ముందు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అన్నట్టు మారిపోయిన సుకుమార్ ఇమేజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. మాస్ పల్స్ ని టచ్ చేస్తే తన నుంచి ఇండస్ట్రీ హిట్ కు తక్కువ స్థాయి సినిమా రాదని ప్రూవ్ చేసిన సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబు కోసం కథను వండే పనిలో ఉన్న సంగతి తెలిసిందే . మైత్రి బ్యానర్ లోనే రూపొందే ఈ మూవీ కోసం ప్రిన్స్ ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ నిర్మాతల మొదటి సినిమా శ్రీమంతుడు ఇచ్చిన జ్ఞాపకాలు చిన్నవి కావుగా. కాకపోతే స్టొరీ ఫైనల్ కావడంలో టైం పడుతోందట.

ఎలాగూ మహర్షి షూటింగ్ ఇంకో మూడు నాలుగు నెలలు సాగుతుంది కాబట్టి ఆ లోపు సుక్కు మహేష్ ని మెప్పించే కథను సిద్దం చేస్తే అది విడుదల కాగానే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోవచ్చు. తాజా అప్ డేట్ ప్రకారం సుకుమార్ నెక్స్ట్ మూవీ ప్లానింగ్ లో కూడా ఉన్నాడట. మహేష్ తో ప్రాజెక్ట్ పూర్తవ్వగానే డార్లింగ్ ప్రభాస్ తో చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడని సమాచారం. కాని దానికి బాగా టైం పడుతుంది.

సాహోతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల షూటింగ్స్ లో ప్రభాస్ బాగా బిజీగా ఉన్నాడు. అవి రెండు పూర్తి చేసి ఫ్రీ కావడానికి వచ్చే ఏడాది చివరి దాకా సమయం పడుతుంది. ఆలోగా సుకుమార్ మహేష్ సినిమాను ఒక కొలిక్కి తెచ్చుంటాడు. సో 2019 డిసెంబర్ లోనో లేక ఆపై 2020 జనవరిలోనో షూటింగ్ మొదలుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ అంటే వినగానే ఏదో కిక్ వస్తోంది కదూ. క్రేజీ కాంబో అంటే అంతే అలాగే ఉంటుంది
Please Read Disclaimer