స్టార్ డైరెక్టర్ వైఫ్ ఆ బిజినెస్ టేకప్ చేసింది

0

స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్ల భార్యలు గతంలోలాగా జస్ట్ హౌస్ వైఫ్ అన్నట్టుగా కాకుండా ఇంట్రెస్టింగ్ బిజినెస్ లతో తమ సత్తా చాటుతున్నారు. ఒకవైపు భర్త.. పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే వారు బిజినెస్ లో కూడా రాణించడానికి చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ లిస్టు లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ వైఫ్ తబిత కూడా జాయిన్ అయింది.

తాజా సమాచారం ప్రకారం తబిత మరో ముగ్గురు పార్టనర్లతో కలిసి ‘లాండ్రీకార్ట్'(Laundrykart) అనే సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ ఖరీదైన దుస్తులను ఉతకడం.. ఇస్త్రీ చేయడం.. డ్రై క్లీనింగ్ చేయడం లాంటి సర్వీసులను అందిస్తుంది. ఈ సేవలను ఒక యాప్ ద్వారా పొందే అవకాశం ఉందట. ఇప్పటికే హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ.. మియాపూర్.. లాంకో హిల్స్ లాంటి ఏరియాలలో ఆఫీసులు కూడా ఉన్నాయట. భర్త సుకుమార్ స్టైల్ లోనే భార్యామణి కూడా డిఫరెంట్ గా ఉండే బిజినెస్ ను ఎంచుకోవడం విశేషం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి ఇప్పటికే ‘పీకబూ'(Peek-a-boo) అనే పేరుతో ఒక చిన్నపిల్లల ఫోటోగ్రఫీ సేవల కంపెనీని నిర్వహిస్తోంది. మరోవైపు దర్శకుడు శ్రీను వైట్ల బెటర్ హాఫ్ రూప కూడా వేదిక్ మిల్క్ బ్రాండ్ తో ఆర్గానిక్ ఉత్పత్తుల కంపెనీని నడుపుతోంది. వీరిద్దరిలాగానీ తబిత కూడా తను ఎంచుకున్న బిజినెస్ లో విజయం సాధించాలని కోరుకుందాం.
Please Read Disclaimer