మెగాహీరో కోసం సాంగ్ పాడిన సుమ!

0Suma-and-anasuya-suya-suya-మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ ఈ నెలాఖర్లో విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి థమన్ అందించిన ఆడియోలో ఒక్కో పాటను ఒక్కో స్టార్ చేత విడుదల చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కాగా, తాజాగా ‘సుయ సుయ’ అంటూ మూడో పాటను విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ విడుదల చేయనున్న ఈ పాటకు చాలా విశేషాలున్నాయట.

మొదటిది స్టార్ యాంకర్ అనసూయ ఈ పాటలో తన స్టెప్పులతో అదరగొట్టనుండడం అయితే, రెండోది మరో స్టార్ యాంకర్ సుమ ఈ పాటను పాడడం. అనసూయ విన్నర్‌లో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని ఎప్పుడో ప్రకటించిన టీమ్, ఆ పాటను సుమ పాడారన్న విషయాన్ని మాత్రం ఇప్పడే ప్రకటించారు. సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మించారు.