ఆ చర్చలు ఏఎన్నర్ పాత్ర కోసమే

0బయోపిక్ ని తెరకెక్కించాలి అంటే ఎంత కష్టమో మన టాలీవుడ్ కి ఇప్పుడిపుడే అర్థమవుతోంది. బయోపిక్ అనేది బెస్ట్ హిట్ ఫార్ములా. కరెక్ట్ గా తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయగలవు. అందుకే దర్శకులు తారలు బయోపిక్ చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. నటీనటులు విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం తేడా కొట్టినా కూడా మొదటికే మోసం వస్తుంది.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ అలానే ఆలోచిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. బాలకృష్ణ తారకరామారావు గారి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో అతికీలకమైన మరో పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారిదే. ప్రస్తుతం ఆ పాత్ర కోసం బాలకృష్ణ – క్రిష్ గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు. మొన్నటి వరకు అయితే చైతు బెస్ట్ అనుకున్నారు. మహానటి సినిమాలో ఏఎన్నర్ పాత్రలో ఆయన కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు దర్శకుడు క్రిష్ సుమంత్ అయితే ఎలా ఉంటుంది అని బాలయ్య దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. అవసరం అయితే టెస్ట్ షూట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్. క్రిష్ కి నచ్చితే బాలయ్య అయితే మరో మాట చెప్పకుండా ఫైనల్ చేసేస్తారు. మరి సుమంత్ ని ఫిక్స్ చేస్తే అతను ఆ పాత్రకు ఎంతవరకు సెట్ అవుతాడో చూడాలి.