మళ్ళీ తెరపై ఆ పాత చంటిగాడు

0


sundeepకొన్ని ఫేమస్ పాత్రలు ఆధారంగా చేసుకొని కొత్త పాత్రలు పుట్టిస్తూ ఉంటారు మన సినిమా రచయతలు. కొన్ని అయితే అలానే పెట్టి ఆ పాత్రలుకు ఉన్న క్రేజ్ ని వాడుకొంటారు. ఇంకా కొంతమంది అలాంటి ఛాయలు ఉన్న మరో కొత్త పాత్ర సృష్టిస్తారు. ఇప్పుడు వస్తున్న కొంతమంది హీరోలు మన పాత హీరోలు చేసిన కొన్ని పాత్రలును అప్పుడుప్పుడు చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ లాగే చేస్తారు అని కాదు.. కానీ వాళ్ళని గుర్తుకు వచ్చేలా చేస్తారని అనుకోవచ్చు.

ఈ రోజు విడుదలైన ముల్టీ స్టారర్ సినిమా ‘శమంతకమణి’ లో సందీప్ కిషన్ పాత్ర అలానే ఉందని టాక్. శమంతకమణి సినిమాలో సందీప్ పచ్చి పల్లెటూరు పచ్చీసులా కనిపించాడట. పంచె కట్టు భాష అన్నీ బాగా దేశి స్టైల్ లో ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ పాత్ర ఇంతకు ముందు కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ‘సింధూరం’ సినిమాలో రవితేజ చేసిన చంటి పాత్రలాగా ఉందట. సందీప్ ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి అభిమానిగా నటించాడట. కోటిపల్లి శివగా సందీప్ చెలరేగి నటించాడు అని అంటున్నారు. ఏదై ఏమైనా కోటిపల్లి శివ పాత్ర ఏంటో ఎలా ఉందో పూర్తి వివరాలు ఇంకా తెలియవలిసి ఉంది.

ఇకపోతో ప్రేక్షకులు కోటిపల్లి శివకు ఎటువంటి స్పందన ఇస్తారో అనేది చూడాలి. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నారా రోహిత్ ఆది సాయికుమార్సుధీర్ బాబు కూడా హీరోలుగా నటిస్తున్నారు.