అల్లరి నరేష్ – సునీల్ డేట్ ఫిక్స్

0అల్లరి నరేష్.. ఒకప్పటి కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయికి చేరుతాడని అందరూ ఇతడి పేరే ప్రస్తావించారు. అల్లరి సినిమాతో మొదలైన ఈ హీరో ప్రయాణం.. కితకితలు – శంభో శివశంకర – సీమశాస్త్రి – సుడిగాడు లాంటి హిట్స్ తో పీక్ స్టేజికి వెళ్లింది.. కానీ ఆ తర్వాతే ఫ్లాపులు పలకరించాయి. కామెడీ కి కేరాఫ్ అడ్రస్ గా మారి మూస ధోరణితో కామెడీ సినిమాలు చేసి ఫ్లాపులు కొనితెచ్చుకున్నాడు. వరుస ఫ్లాపులతో ఈ మధ్య సినిమాలన్నీ తగ్గించేశాడు. చివరగా తీసిన ‘మేడ మీద అబ్బాయి’ సినిమా కూడా ఆడకపోవడంతో సంవత్సరం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నాడు.

ఇక సునీల్ ది వేరే కథ.. కమెడియన్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న – అందాల రాముడు లాంటి హిట్స్ తర్వాత హీరోగా పూర్తిగా సెటిల్ అయ్యాడు. కానీ తరువాత వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇప్పుడు ఇక హీరోగా కాడి వదిలేసి మళ్లీ సునీల్ కమెడియన్ అవతారం ఎత్తాడు.. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు..

ఇలా ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు కామెడీ హీరోలతో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భీమనేని శ్రీనివాసరావు తాజాగా ఓ సినిమా తీశాడు.. అదే ‘సిల్లీ ఫెలోస్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ కొద్దిరోజుల కిందట లాంచ్ చేశారు. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. సినిమా గురించి జనాలకు కూడా తెలియడం లేదు. ఇప్పటికైనా సినిమా ప్రమోషన్ చేస్తే మంచిదని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 7న మూవీని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు వారం ముందు.. ఆ తర్వాత ‘శైలజా రెడ్డి అల్లుడు’ – నర్తన శాల లాంటి పెద్ద సినిమాలొస్తున్నాయి. మరి మధ్యలో వస్తున్న సిల్లీ ఫెలోస్ ఈ ఫ్లాప్ ల హీరోలకు ఎలాంటి క్రేజ్ తెస్తుందో చూడాలి మరి..