మాస్ రాజా కు కిరాక్ అసిస్టెంట్!

0

మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరో కాబట్టి రవితేజ కామెడీ గురించి అందరూ తక్కువగా మాట్లాడతారు. మాస్ రాజాకు కనుక సునీల్ లాంటి కామెడీ రాజా కనుక తోడైతే ఆ అల్లరి ఓ రేంజ్ లో ఉంటుంది. గతంలో రవితేజ – సునీల్ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్లు ఇప్పటికీ అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాలో వీళ్ళిద్దరూ కలిస్తే ఓ రకంగా అరాచకమే.

చాలా ఏళ్ళ తర్వాత ప్రేక్షకులకు ఈ డెడ్లీ కాంబినేషన్ ను చూసే అవకాశం ‘అమర్ అక్బర్ అంటోనీ’ తో రానుంది. ఈ సినిమాలో సునీల్ నటించాడన్న విషయం తెలిసిందే. కానీ ఎలాంటి పాత్ర చేశాడు అన్నది రీసెంట్ గా బయటకు వచ్చింది. సునీల్ ఈ సినిమాలో రవితేజకు అసిస్టెంట్ పాత్రలో కిరాక్ పంచ్ లు వేస్తూ నటించాడని సమాచారం. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేశాడట. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రోమోస్ లో సునీల్ కనబడలేదు గానీ ట్రైలర్ లో మాత్రం సునీల్ ను చూపించే అవకాశం ఉందట.

చిత్రమైన విషయం ఏంటంటే శ్రీను వైట్ల – రవితేజ ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక సునీల్ కమేడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ‘సిల్లీ ఫెలోస్’.. ‘అరవింద సమేత’ సినిమాల్లో నటించాడు. ‘సిల్లీ ఫెలోస్’ ఫ్లాప్ గా నిలవగా.. ‘అరవింద సమేత’ సీరియస్ ఫ్యాక్షన్ డ్రామా కావడంతో సునీల్ కామెడీకి స్కోప్ లేకుండా పోయింది. మరి ‘అమర్ అక్బర్ అంటోనీ’ తో అయినా మళ్ళీ ట్రాక్ లో కి వస్తాడో లేదో వేచి చూడాలి.
Please Read Disclaimer