షాక్ : త్రివిక్రమ్ వద్ద రూ.2000 కోట్ల బడ్జెట్ కథ

0

హీరోగా ప్రయత్నాలు చేసి కొన్ని సక్సెస్ లు దక్కించుకుని ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు అవ్వడంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా బిజీ అయ్యాడు. ఒకప్పుడు కమెడియన్ గా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న సునీల్ మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమద్య సునీల్ వరుసగా ఇంటర్వ్యూలతో మీడియాలో పదే పదే కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ మరియు సునీల్ మద్య స్నేహం గురించి అందరికి తెల్సిందే. అయినా కూడా మళ్లీ మళ్లీ తమ మద్య ఉన్న స్నేహం గురించి సునీల్ చెబుతూ మీడియాలో చోటు సంపాదిస్తున్నాడు.

మీడియాలో ఫోకస్ అవ్వడం వల్ల సినిమాల్లో బిజీ అవ్వాలనే ఉద్దేశ్యమో లేక మరేంటో కాని సునీల్ తాజాగా మరోసారి త్రివిక్రమ్ గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సునీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. త్రివిక్రమ్ నాకు చాలా ఏళ్ల క్రితం ఒక కథ చెప్పాడు. ఆ కథ ఒక అద్బుతం. అప్పట్లో ఆ కథతో సినిమా తీయాలంటే 500 కోట్ల బడ్జెట్ ఖర్చు అయ్యేది ఇప్పుడు అదే కథతో సినిమా తీయాలి అంటే 2000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. ఒకవేళ అంత బడ్జెట్ పెట్టి తీసినా కూడా అంతకు మించి వసూళ్లు వస్తాయి అంతటి గొప్ప కథ అది అంటూ సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఏది కూడా 500 కోట్లకు మించలేదు. 2.ఓ చిత్రం కాస్త అటు ఇటుగా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. కాని కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక ఇండియన్ సినిమాలు అయిన బాహుబలి మరియు దంగల్ చిత్రాలు మాత్రమే రెండు వేల కోట్ల వసూళ్ల వరకు వెళ్లాయి. బడ్జెట్ రెండు వేల కోట్లు ఉంటే వసూళ్లు కనీసం మూడు వేల కోట్లు అయినా అయ్యి ఉండాలి. అంతటి వసూళ్లను సాధించడం అంటే మామూలు విషయం కాదు. మరి సునీల్ మాత్రం ఆ కథపై చాలా నమ్మకం ఉందని చెబుతున్నాడు.

సునీల్ ఈ వ్యాఖ్యలతో మరోసారి మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు. సినీ వర్గాల్లో ప్రస్తుతం సునీల్ వ్యాఖ్యల గురించిన చర్చ జరుగుతోంది. సునీల్ ఏ ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని చెప్పాడో కాని త్రివిక్రమ్ వద్ద ఉన్న ఆ కథ గురించి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. నిర్మాతలు మరియు హీరోలు ఆ కథను వినేందుకు ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చిత్రాన్ని చేస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. కీలక పాత్రలో టబు నటించబోతుందట.
Please Read Disclaimer