సునీల్ పాత రూపం.. ఇదే ప్రూఫ్

0

గత కొన్నేళ్లుగా సునీల్ హీరోయిజం చూస్తున్న ఆడియెన్ కి ఎన్నో సందేహాలు. ఎంతో లావుగా ఉండే సునీల్ రూపం మార్చి తప్పు చేశాడా? అని! అయితే ఆ తప్పుకు కూడా మీనింగ్ ఉంది అని చాలాసార్లు చెప్పాడు సునీల్. హీరోగా అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పాడు. పైగా క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఏరోజూ సుఖం – నిద్ర ఉండదు. హీరో అయితే రిలాక్స్ టైమ్ ఎక్కువ. ఫ్యామిలీ టైమ్ ఎక్కువే.. క్యారెక్టర్ ఆర్టిస్టుతో పోలిస్తే అని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇటీవల హీరోగా సక్సెస్ లేకపోవడంతో తిరిగి తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత రూపానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి తనకు క్యారెక్టర్లు రాస్తూ స్నేహితుడు త్రివిక్రమ్ ఆదుకుంటున్నాడు. ఫ్రెండు ఉన్నాడనే నా ధైర్యం అని అరవింద సమేత ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పకనే చెప్పేశాడు.

భయ్యా అభిమానులకు నాలుగైదు సార్లు నమస్కారం.. అని తారక్ అభిమానుల్ని ఉద్ధేశించి అన్న సునీల్ అసలు ప్రసంగంలోకి వెళ్లాడు. “చాలా సంవత్సరాల తర్వాత సినిమా అంతా కనిపించే మంచి పాత్ర చేశాను. అమ్మా నాన్న ఓపిగ్గా పెంచితే – బడికెళ్లాక గురువులు విజ్ఞానం నేర్పుతారు. అన్నయ్యలు – పెద్దలు డబ్బులిచ్చి బాగా చూస్తారు. అలా నాకు మూడూ కలిపి ఇచ్చాడు త్రివిక్రమ్. హైదరాబాద్ వచ్చాక ఆ మూడు పోర్షన్లు తీసుకున్న వ్యక్తి తను. జీవితంలో నువ్వు మంచి ఫ్రెండును సెలక్ట్ చేసుకుంటే చాలు ధీమాగా ఉంటుంది. అలా సెలక్ట్ చేసుకున్న వ్యక్తి త్రివిక్రమ్. ఇది చెప్పడం ఆనందాన్నిస్తుంది. చాలా మంచి ఛాన్సొచ్చింది. ఎన్ని వేషాలు వేసినా ఫైనల్ గా నాకో మంచి వేషం రాయడానికి తానున్నాడని దైర్యం“ అనీ స్నేహితుడు త్రివిక్రమ్ గురించి చెప్పాడు. ఒకే మంచం – ఒకే కంచం షేర్ చేసుకుని సింగిల్ టీ షేర్ చేసుకున్న రోజుల్లోకి వెళ్లాడు సునీల్. మొత్తానికి ఫ్రెండు మళ్లీ తనకు అరవింద సమేత రూపంలో ఆదుకుంటున్నాడని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ ఈవెంట్ లో సునీల్ మునుపటితో పోలిస్తే చాలా బొద్దుగా – లావుగా కనిపించాడు. అంటే పాత రూపానికి షిఫ్లవుతున్నట్టే భావించవచ్చు. అంటే సునీల్ ఇచ్చే కొత్త ట్రీట్ కోసం వేచి చూడాలన్నమాట!!
Please Read Disclaimer