రొమాన్స్ లో మా ఆయన కింగ్ అంటోంది

0

పరిస్థితుల ప్రభావం వల్ల పోర్న్ స్టార్ అయ్యానంటున్న సన్నీలియోన్ గత ఏడు సంవత్సరాలుగా వాటికి పూర్తిగా దూరంగా ఉంటోంది. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా – క్యారెక్టర్ ఆర్టిస్టుగా – ఐటెం గర్ల్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు మరియు తమిళ ఆడియన్స్ ముందుకు కూడా ఈ అమ్మడు వచ్చి మెప్పించింది. స్టార్ హీరోయిన్స్ స్థాయిలో స్టార్ డంను దక్కించుకున్న సన్నీలియోన్ బయోపిక్ ‘కరంజీత్ కౌర్’ వెబ్ సిరీస్ గా తెరకెక్కి మంచి ఆధరణ పొందింది. సన్నీ బయోపిక్ కు ఆన్ లైన్ లో భారీ వ్యూస్ దక్కాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీలియోన్ మాట్లాడుతూ తన రొమాంటిక్ లైఫ్ గురించిన ఆసక్తికర కామెంట్స్ చేసింది. సన్నీలియోన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో మీరు ఎవరితో రొమాన్స్ చేయాలని భావిస్తారు ఎవరితో రొమాన్స్ చేయడంకు మీరు ఇష్టపడతారు అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె స్పందిస్తూ.. నన్ను నా భర్త డానియెల్ మాదిరిగా ఎవరు ముద్దు పెట్టి ఆనందింపజేయలేరు. నాకు డానియెల్ మాత్రమే రొమాంటిక్ గా ముద్దు పెట్టగలడు అతడితోనే నేను రొమాన్స్ ను ఎంజాయ్ చేస్తానంటూ పచ్చిగా చెప్పేసింది. ఇక స్క్రీన్ పై ఎవరిని ముద్దు పెట్టినా ఎవరితో రొమాంటిక్ గా నటించినా కూడా అది కేవలం కెమెరా ముందు వరకే అంటూ చెప్పుకొచ్చింది.

కెరీర్ ఆరంభంలో కేవలం గ్లామర్ పాత్రలకు – ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అయిన సన్నీలియోన్ ఆ తర్వాత మెల్ల మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రల్లో కనిపించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాల్లో కీలక పాత్రలో కూడా సన్నీలియోన్ నటిస్తోంది. నటిగా నిరూపించుకునేందుకు ఎంత కష్టపడేందుకు అయినా సిద్దం అంటున్న సన్నీ లియోన్ ముందు ముందు ఛాలెంజింగ్ పాత్రలను చేసేందుకు సిద్దం అంటూ చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer