అమ్మ అయిన సన్నీలియోన్‌

0Sunny-Leone-turns-motherబాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌, డానియెల్‌ వెబర్‌ దంపతులు పాపను దత్తత తీసుకున్నారు. తొలుత ఈ విషయాన్ని నటి షెర్లిన్‌ చోప్రా ట్వీట్‌ చేయగా.. అందుకు రిప్లై ఇచ్చిన సన్నీ బేబీని దత్తత తీసుకున్న విషయాన్ని ధ్రువీకరించారు.

సన్నీలియోన్‌, వెబర్‌లకు 2011లో వివాహం జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన 21 నెలల వయసున్న పాపను సన్నీ-వెబర్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెకు నిషా కౌర్‌ వెబర్‌ అని పేరు పెట్టారు. షెర్లిన్‌ ఆమె చేసిన ట్వీట్‌కు నిషా ఫోటోను కూడా జత చేశారు.

అమ్మను కావడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందని సన్నీ ఓ జాతీయ పత్రికతో చెప్పారు. తన భావాలు వ్యక్తం చేయలేకపోతున్నాని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, లాతూర్‌ మహారాష్ట్రలో అత్యంత నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతం అన్న విషయం తెలిసిందే.