ఫొటోలతో ప్రమోషన్లు చేస్తున్న సన్నీ

0సన్నీ లియోన్ అటు సినీమాలతోనూ ఐటమ్ సాంగ్స్ తోనూ – రియాలిటీ షోలతోనే కాక తన వెబ్ సిరీస్ వలన కూడా బిజీగా ఉంటోంది. ‘కరెంజిత్ కౌర్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ టైటిల్ తో విడుదల అవ్వనున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్ సూచిస్తున్నట్టు సన్నీ జీవిత చరిత్ర మీదనే బేస్ అయ్యి ఉంటుంది. త్వరలో విడుదల అవ్వనున్న ఈ వెబ్ సిరీస్ కోసం ప్రోమోషన్స్ కూడా యాక్టీవ్ గానే చేస్తోంది సన్నీ.

సోషల్ మీడియా లో షూటింగ్ నుండి కొన్ని ఫోటోలు పెడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తోంది. తన కోస్టార్ మార్క్ బక్నర్ తో ఫోటో పెట్టి అతనితో షూటింగ్ జరుగుతుంటే చుట్టుపక్కల కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అంటూ పోస్ట్ చేసింది. తన తమ్ముడు పాత్ర పోషిస్తున్న అబ్బాయితో ఫోటో దిగి – దానిని పోస్ట్ చేసి ఈ షో కోసం చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారని వాలంతా తన కథను అద్భుతంగా ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది.

అంతేకాదు అనుకున్న టైం కంటే ముందే ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయనున్నారని పేర్కొంటోంది. తన వెబ్ సిరీస్ కాకుండా సన్నీ ప్రస్తుతం హింది రియాలిటీ షో స్ప్లిట్స్ విల్లా కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అలానే తమిళంలో వీరమహాదేవి అనే సినిమాలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో సన్నీ ఒక వారియర్ లా కనపడనుంది.