కొత్త చిక్కుల్లో సన్నీలియోన్

0Sunny-Leone-Can-Get-In-Legal-Troubleపోర్న్ యాక్టర్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగి మొత్తం దేశమంతటా అభిమానులను సంసాదించుకున్న ఘనత సన్నీలియోన్ కే సొంతం. ఇటీవల కేరళలో ఓ షాప్ ఓపెనింగుకు వెళ్లిన ఆమెను చూడటానికి ఇసకేస్తే రాలనంత మంది జనం వచ్చారంటే జనాల్లో ఆమెకున్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడీ భామ లీగల్ గా చిక్కుల్లో పడింది.

సన్నీ లియోన్ తన భర్త వెబర్ తో కలిసి ఇటీవల సుమారు రెండేళ్ల వయసున్న ఆడపిల్లను దత్తత తీసుకుంది. ఆమెకు నిషా కౌర్ వెబర్ అనే పేరు పెట్టి దంపతులిద్దరూ చక్కగా పెంచుకుంటున్నారు. ఆ పని అంతా చట్టబద్ధంగానే పూర్తి చేసింది. తాను పాపను దత్తత తీసుకున్న విషయం సోషల్ మీడియా ద్వారా సన్నీలియోన్ ప్రపంచానికి తెలియజేసింది. బాలిక రంగు – రూపురేఖలు బయటపెట్టి ఆమె ప్రైవసీకి భంగం కలిగించారంటూ సెంట్రల్ గవర్నమెంట్ లోని సెంట్రల్ అడాప్షన్ అథారిటీ (సీఏఆర్ ఏ) సీరియస్ అయ్యింది. ఓ పసిపాపను దత్తత తీసుకోవాలనే ఆలోచనను అభినందిస్తూనే జువైనల్ జస్టిస్ యాక్ట్ ను ఉల్లంఘించారంటూ వారిపై ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. దీనిపై మహిళా – శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీకి కంప్లయింట్ కూడా అందింది.

ఆలనాపాలనా లేని రెండేళ్ల చిన్నారిని దత్తత తీసుకుని ఆమెకు మంచి లైఫ్ ను అందించాలని సన్నీలియోన్ దంపతులు భావిస్తే చివరకు వారు జువైనల్ జస్టిస్ బోర్డు నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అంతా చట్టప్రకారమే చేసినా చివరిలో చేసిన పొరపాటు వారిని చిక్కుల పాలు చేసింది. ఒక్కోసారి మంచి పని చేయడానికి కూడా మాట పడాల్సి వస్తుందని సన్నీ లియోన్ దంపతులకు అర్ధమై ఉంటుంది. జువైనల్ బోర్డుకు వారిచ్చే సమాధానమేంటో వేచి చూడాలి మరి.