గణేష్ చతుర్థి నాడు సన్నీ ఏం చేసింది?

0కొంతమంది పేర్లు వినగానే కొన్ని విషయాలు గుర్తొస్తాయి. నరేంద్ర మోదీ అనగానే పని పక్కనబెట్టి దంచి కొట్టే స్పీచులు.. కేసీఆర్ అనగానే చవటలు సన్నాసులు దద్దమ్మలు అని ప్రత్యర్థులపై విరుచుకుపడే తిట్లు.. అవి లేకనే కదా నివేదన సభను చప్పగా ఉందని జనాలు అనుకున్నది! ఇవన్నీ రాజకీయాలు… గ్లామర్ విషయానికి వస్తే సన్నీ లియోన్ అనగానే మీకు ఏవోవో గుర్తొస్తాయి. కానీ సన్నీ లియోన్ ట్విట్టర్ లో క్యాప్షన్ ఏంటంటే “ఓన్లీ గాడ్ విల్ జడ్జ్” .. అంటే తప్పో ఒప్పో నిర్ణయించేది దేవుడు మాత్రమే.

మరి గణేష్ చతుర్థి పండగ వస్తే ఎలా ఆ దేవుడ్ని.. అందులో విఘ్న నాయకుడిని తలచుకోకుండా ఉంటుంది? భర్త డేనియల్ వెబర్ తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియో ను పోస్ట్ చేసింది. ఆ వీడియో లో వెబర్ సన్నీ ని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇక “నాకు సంప్రదాయాలు.. అన్నీ రూల్స్ తెలియవు.. ముఖ్యంగా ఈ రోజు ఏం పని కరెక్ట్ గా చేయాలో కూడా తెలీదు. కానీ నేను వెబర్ మాత్రం గణేష్ చతుర్థిని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి జరుపుకుంటున్నాం. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు అల్.”

ఈ ఇంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? సన్నీ కి ఫుట్ వేర్ అంటే ప్రాణం. తనకున్న షూస్ అన్నీ ఈ ఇంట్లో ఉన్న ఒక వార్డ్ రోబ్ లో సరిపోతాయట. సరిపోవడం కాదు ఇంకా ఖాళీ ఉండదట.. వాటిని కూడా నింపాలట. ఇంతకీ దాన్ని డిజైన్ చేసిందెవరనుకున్నారు? ఇంకెవరు సన్నీ భర్త డేనియల్ వెబరే!