అనుష్కని కాపీ కొట్టిన సన్నీ

0సన్నీలియోన్‌.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. పోర్న్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన సన్నీలియోన్‌, ఇప్పుడు బాలీవుడ్ అడల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అటు ఐటెం సాంగుల్లో కూడా ఇరగదీస్తోంది సన్నీ. అయితే ఇప్పుడు తొలిసారి ఓ వార్ సినిమా చేయబోతుంది సన్నీ. అవును ఆమె ప్రధాన పాత్రగా ఒక చారిత్రక చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది.

పోన్స్ స్టీఫెన్ నిర్మాణంలో వి.సి.వడివుడయన్ ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ , అనుష్కని కాపీ కొట్టింది. కత్తి, విల్లు పట్టుకుని ఉంది సన్నీలియోన్ ఈ పోస్ట‌ర్‌లో….కాని ఈ పోస్ట‌ర్ చూసిన వారంద‌రు ఇలాంటి పోస్ట‌ర్‌ను ఎక్క‌డో చూసిన‌ట్లు ఉందే అనుకుంటున్నారు. ఆ సినిమా మ‌రేదో కాదు మ‌న స్వీటీ అనుష్క న‌టించిన ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో అనుష్క సేమ్ ఫోజు చూసి అంద‌రూ సన్నీ అనుష్క‌ని బాగానే కాపీ కొట్టిందని కామెంట్ చేస్తున్నారు