రోగ్ ఆడియోలో ఈ రోజు సన్నీ డాన్స్

0Sunny-Leone-Danceపూరీ జగన్నాధ్ రోగ్ మూవీ ఆడియో వేడుక ఇవాళ సాయంత్రమే జరగనుంది. తెలుగు.. కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి కన్నడ ఆడియో ఫంక్షన్ ఇప్పటికే పూర్తి కాగా.. తెలుగు వెర్షన్ రోగ్ కోసం ఇవాళ హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.

ఈ వేడుకలో సన్నీ లియోన్ డ్యాన్స్ షో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ కార్యక్రమంలో సన్నీని 20 నిమిషాల పాటు డ్యాన్స్ చేసేందుకు అంగీకరింప చేసింది ఛార్మీ. కొన్ని హాట్ పాటలతో రూపొందించిన ఓ మెడ్లేకు సన్నీ డ్యాన్స్ చేయనుండగా.. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సన్నీని ఈ కార్యక్రమంలో పెర్ఫామ్ చేసేందుకు ఒప్పించిన ఘనత మాత్రం పూరీ జగన్నాధ్ కే దక్కుతుంది.

ఇటు బోలెడంత ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు.. భారీగా రెమ్యూనరేషన్ ముట్టచెబుతుండడంతో.. సన్నీ కూడా ఈ కార్యక్రమంలో పెర్ఫామ్ చేసేందుకు సంతోషంగానే అంగీకరించింది. ఇప్పటివరకూ అంతగా హైప్ క్రియేట్ కాని రోగ్ మూవీకి.. సన్నీ డ్యాన్స్ షో బోలెడంత హెల్ప్ చేయనుందని అంచనాలున్నాయి.