సన్నీ లియోన్.. ఇద్దరు కవలలు.. ఓ కూతురు

0సెక్సీ తార సన్నీ లియోన్ ఏం చేసినా అది సంచలనమే. ఎక్కడ కనిపించినా కెమెరాలు ఆమె చుట్టూ కమ్ముకుపోవాల్సిందే. రీసెంటుగా సకుటుంబ సమేతంగా కలిసి వస్తూ ముంబయి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది సన్నీ. సన్నీ దంపతులు కొన్నేళ్ల కిందట నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సరోగసి విధానం ద్వారా మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు సన్నీ దంపతులు.

ఈ కవలలకి అషర్- నోయా (Noah) అని పేర్లు పెట్టారు సన్నీ అండ్ డానియల్ వెబర్. తన కుటుంబంతో కలిసి వస్తున్న ఫోటోని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన సన్నీ… ‘అసలు ఇంత పెద్ద మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోబోతున్నామని నాకు గానీ డానియల్ గానీ తెలీదు. ఇదంతా దేవుడి ప్లాన్ లా ఉంది. మూడు మిరాకిల్స్ లాంటి పిల్లలను పొందడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం ఇప్పుడు పరిపూర్ణమైంది’ అంటూ ట్వీట్ చేసింది సన్నీ. సరోగసి విధానం ద్వారా పొందిన పిల్లల గురించి కూడా చెప్పింది. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలో ఎయిర్ పోర్టులో వెళుతూ.. అలా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కెమెరా కళ్లకు చిక్కారు.

ఓ పోర్న్ స్టార్ గా జీవితం స్టార్ చేసిన సన్నీ లియోన్… బాలీవుడ్లో అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు ఓ మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుని చాలామందికి సూర్ఫి దాయకంగా నిలుస్తోంది.